TG High Court Jobs 2025: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?

Telangana High Court Civil Judges Recruitment 2025 Notification: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 66 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ పోస్టుల కోసం డిసెంబర్‌ 8 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబర్‌ 29వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి..

TG High Court Jobs 2025: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?
Telangana High Court Jobs

Updated on: Dec 03, 2025 | 10:20 AM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 3: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 66 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ పోస్టుల కోసం డిసెంబర్‌ 8 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబర్‌ 29వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 29న రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ పోస్టులకు సంబంధించిన నియామక పరీక్ష తేదీలు, సమయం, హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌, కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT)కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని సూచించారు.

ఐబీపీఎస్‌ పీఓ మెయిన్స్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) మెయిన్స్‌ 2025 ఫలితాలు తాజగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రోల్‌ లేదా రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. మెయిన్స్‌లో అభ్యర్ధులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. కాగా అక్టోబర్ 12వ తేదీన ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) మెయిన్స్ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఐబీపీఎస్‌ పీఓ మెయిన్స్‌ మెరిట్‌ లిస్ట్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.