TS High Court Jobs 2023: నెలకు రూ.1,15,270ల జీతంతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ట్రాన్స్‌లేటర్‌(తెలుగు/ ఉర్దూ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

TS High Court Jobs 2023: నెలకు రూ.1,15,270ల జీతంతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..
TS High Court
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 14, 2023 | 1:24 PM

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 8 ట్రాన్స్‌లేటర్‌(తెలుగు/ ఉర్దూ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ (ఆర్ట్స్‌/సైన్స్‌/లా) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలుగు/ఉర్దూ ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా లేదా సర్టిఫికేట్‌ కోర్సుతో కూడా ఉండాలి. అలాగే అనువాదంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జనవరి 11, 2023 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిల సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 11, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 21 నుంచి ప్రారంభమవుతుంది. ఓసీ/బీసీ కేటగిరీ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు రూ.400లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష 2023 మార్చిలో నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.42,300ల నుంచి రూ.1,15,270ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.