TGPSC Group 1 Mains: టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కు లైన్‌ క్లియర్‌.. పిటీషన్లు కొట్టివేసిన హైకోర్టు

తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. గ్రూప్‌ 1 నోటిఫికేషన్లను సవాల్‌ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. వీటితోపాటు ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టేసింది. దీంతో గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు యథావిధిగా అక్టోబర్‌ 21 నుంచి..

TGPSC Group 1 Mains: టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కు లైన్‌ క్లియర్‌.. పిటీషన్లు కొట్టివేసిన హైకోర్టు
High Court
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 15, 2024 | 2:42 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 15: తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. గ్రూప్‌ 1 నోటిఫికేషన్లను సవాల్‌ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. వీటితోపాటు ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టేసింది. దీంతో గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు యథావిధిగా అక్టోబర్‌ 21 నుంచి జరగనున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై అభ్యర్థులు పలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌లోని 7 ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన జవాబులు ఇవ్వలేదని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. వాటికి మార్కులు కలిపి మళ్లీ కొత్త జాబితా ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ప్రిలిమ్స్‌కి, రిజర్వేషన్ల జీవో 33, తదితర అంశాలపై మొత్తంగా గ్రూప్‌ 1పై హైకోర్టులో 15కుపైగా కేసులు ఉన్నాయి. వీటన్నింటినీ ఈ రోజు హైకోర్టు కొట్టివేసింది.

ప్రిలిమ్స్ పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్షలకు లైన్‌ క్లియర్‌ అయినట్లైంది. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు కూడా విడుదలయ్యాయి. పరీక్షల కోసం టీజీపీఎస్సీ వడివడిగా ఏర్పాట్లు చేస్తుంది. ఇక మెయిన్స్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 31,382 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మరోవైపు హైకోర్టు తీర్పు వల్ల తాము నిరాశకు గురయ్యామని పలువురు గ్రూప్‌ 1 అభ్యర్థులు అంటున్నారు. కోర్టు తీర్పుతో మానసికంగా కుంగిపోయామని, మెయిన్స్‌ ప్రిపరేషన్‌కు కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా విడుదలవడంతో ఈ దశలో మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరడం విశేషం. కమిషన్‌ ఎట్టి పరిస్థితిలోనూ పరీక్షలు నిర్వహించాలనే నిశ్చయించుకుంది. కోర్టు తీర్పు కూడా అనుకూలంగా రావడంతో ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్భందీగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది.

మొత్తం 7 పేపర్లకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పరీక్ష ఉంటుంది. పరీక్ష ప్రారంభానికి మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. అభ్యర్థులు సమయపాలన కచ్చితంగా పాటించాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.