TGPSC Group 2 Hall Ticket Download: టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 హాల్‌ టికెట్లు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండి

|

Dec 09, 2024 | 4:16 PM

తెలంగాణ గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ రోజు నుంచి వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మరో వారంలో గ్రూప్ 2 పరీక్షల రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్ష కేంద్రాల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ కింది లింక్ ద్వారా నేరుగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

TGPSC Group 2 Hall Ticket Download: టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 హాల్‌ టికెట్లు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండి
TGPSC Group 2 Hall Tickets
Follow us on

హైదరాబాద్‌, డిసెంబర్‌ 8: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రూప్‌ 2 సర్వీసు పోస్టులకు సంబంధించిన హాల్‌ టికెట్లు శనివారం విడుదలయ్యాయి. ఆదివారం (డిసెంబరు 9) నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు నేటి నుంచి గ్రూప్‌ 2 హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులకు ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాల్లో డిసెంబరు 15, 16 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే కమిషన్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 4 పేపర్లకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్‌ 1, 3 పరీక్షలు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్‌ 2, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్‌ 2 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా పరీక్షకు హాజరుకానున్నారు.

టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 హాల్‌ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని, ముగింపు సమయంలోగా అభ్యర్ధులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని టీజీపీఎస్సీ అధికారులు అభ్యర్ధులకు సూచించారు. ఉదయం నిర్వహించే పరీక్షకు 9.30 గంటలు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 గంటల తరువాత అభ్యర్థులెవరినీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్‌ ఇ నవీన్‌ నికోలస్‌ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే మరోవైపు గ్రూప్‌ 2 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. సరిగ్గా ఇదే తేదీల్లో ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్ష కూడా ఉండటంతో పరీక్ష తేదీ మార్చాలని గత కొంత కాలంగా నిరుద్యోగులు గ్రూప్‌ 2 వాయిదాకు డిమాండ్‌ చేస్తున్నారు. టీజీపీఎస్సీ ఈ డిమాండ్‌లను పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించలేదు. అందుకే షెడ్యూల్‌ ప్రకారంగానే హాల్‌ టికెట్లను కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. ఒకే రోజు ఈ రెండు పరీక్షల నిర్వహణ ఉండటంతో ఏ పరీక్ష రాయాలో తెలియక అభ్యర్థులు గందరగోళ పడుతున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.