TSPSC Group 1 Jobs: టీఎస్పీయస్సీ గ్రూప్‌-1 వయోపరిమితి పెంచుతూ సర్కార్ నిర్ణయం.. త్వరలో నోటిఫికేషన్‌

|

Feb 10, 2024 | 5:49 PM

తెలంగాణ ప్రభుత్వం తర్వలో గ్రూప్‌-1 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అదనంగా 60 పోస్టులను పెంచిన సర్కార్‌ మొత్తం 563 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనుంది. ఈ క్రమంలో నిరుద్యోగ అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. వయోపరిమితిని 42 యేళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ..

TSPSC Group 1 Jobs: టీఎస్పీయస్సీ గ్రూప్‌-1 వయోపరిమితి పెంచుతూ సర్కార్ నిర్ణయం.. త్వరలో నోటిఫికేషన్‌
Telangana CM Revanth Reddy
Follow us on

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10: తెలంగాణ ప్రభుత్వం తర్వలో గ్రూప్‌-1 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అదనంగా 60 పోస్టులను పెంచిన సర్కార్‌ మొత్తం 563 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనుంది. ఈ క్రమంలో నిరుద్యోగ అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. వయోపరిమితిని 42 యేళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. కొన్ని నిబంధనల వల్ల టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యమైందన్నారు. పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతోకాలం నిరీక్షిస్తుందని, త్వరలోనే 15 వేల పోస్టులు భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌ తెలిపారు.

మేలో టీఎస్‌ ఈసెట్‌, జూన్‌లో లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు

తెలంగాణలో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఈసెట్‌ 2024 పరీక్షను మే 6వ తేదీన నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అలాగే లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌లను జూన్‌ 3న నిర్వహనున్నట్లు వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూళ్లను ఫిబ్రవరి 9న ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి విడుదల చేశారు.

ఫిబ్రవరి14న ఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌

బీఈ, బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిప్లోమా, బీఎస్‌సీ మ్యాథ్స్‌ అభ్యర్థులకు నిర్వహించే టీఎస్‌ ఈసెట్‌-2024కు ఫిబ్రవరి 14న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఉన్నతవిద్యామండలి తెలిపింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఆ మరుసటి రోజు నుంచే అంటే ఫిబ్రవరి 15 నుంచే ప్రారంభమవుతుంది. ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించకుండా ఏప్రిల్‌ 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెల్పింది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యా మండలి పేర్కొంది. రూ.500 ఆలస్యరుసుంతో ఏప్రిల్‌ 22వ తేదీ వరకు, రూ.వెయ్యి ఆలస్య రుసముతో ఏప్రిల్‌ 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించింది.

ఇవి కూడా చదవండి

అలాగు 2024-25 విద్యా సంవత్సరానికి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరే అభ్యర్ధులకు నిర్వహించే మూడేళ్ల, అయిదేళ్ల లా కామన్‌, పీజీ లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ప్రవేశపరీక్షలకు ఫిబ్రవరి 28న నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు మార్చి 1 నుంచి స్వీకరించనున్నట్లు పేర్కొంది. కాగా న్యాయ విద్యను అభ్యసించాలనుకునే వారికోసం ఏటా ఉన్నత విద్యామండలి లాసెట్‌, పీజీలాసెట్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.