Telangana: తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు నలుగురు సభ్యులతో సర్కార్ కమిటీ.. వారంలో నివేదిక!

|

Jan 01, 2025 | 8:14 AM

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవడంతో రాష్ట్ర వాసులకు లోకల్, నాన్ లోకల్ సమస్య వచ్చిపడింది. దీంతో ఉద్యోగాలు, ప్రవేశాల్లో ఇదొక కొరకరాని కొయ్యగా మారింది. ఈ సమస్య నివృతికి రేవంత్ సర్కార్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం నలుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ వివరణాత్మకంగా అధ్యయనం చేసి మరో వారంలో ప్రభుత్వానికి సమర్పించనుంది..

Telangana: తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు నలుగురు సభ్యులతో సర్కార్ కమిటీ.. వారంలో నివేదిక!
Committee For Local And Non Local
Follow us on

హైదరాబాద్‌, జనవరి 1: 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి లోకల్, నాన్‌ లోకల్‌ను నిర్ధారించేందుకు సర్కిర్ నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. కమిటీ ఛైర్మన్‌గా ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకృష్టారెడ్డి, కన్వీనర్‌గా రాష్ట్ర సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, సభ్యులుగా ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ నరసింహారెడ్డిని నియమించారు. రాష్ట్ర విభజన పూర్తయి 10 ఏళ్లు అయ్యింది. దీంతో ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర ప్రవేశాల్లో స్థానికతపై ప్రామాణికతను నిర్ధారించాల్సి వచ్చింది. 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు నాలుగేళ్లు రాష్ట్రంలో చదివి ఉంటేనే స్థానికులవుతారు. 15 శాతం కోటా కింద తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. 371 (డి) అధికరణం సర్వత్రా సందేహాలు నెలకొన్నాయి. 15 శాతం కోటా కింద తెలంగాణలో గతంలో నివసించి ఉద్యోగ, వ్యాపారరీత్యా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన పిల్లలు సైతం ఇప్పటివరకు సీట్లు దక్కాయి. ఇప్పుడు ఈ కోటా తొలగిస్తే వీరి పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లోనూ గందరగోళం నెలకొంది. వీటన్నింటి దృష్ట్యా ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి వారంలో నివేదిక అందజేయనుంది.

వైద్యవిద్య పీజీ పరీక్షలు జనవరి 9కి వాయిదా

తెలంగాణలో జనవరి 2వ తేదీ నుంచి జరగాల్సిన వైద్యవిద్య పీజీ వార్షిక పరీక్షలను కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వాయిదా వేసింది. ఈ పరీక్షలు జనవరి 9 నుంచి 18వ తేదీ వరకు జరుగుతాయని రివైజ్‌డ్‌ టైం టేబుల్‌ విడుదల చేసింది.

విదేశాల్లో ఉద్యోగాలకు నైపుణ్య శిక్షణ.. కూటమి సర్కార్ కీలక ఒప్పందం

జర్మనీ, ఖతార్‌ దేశాల్లో బహుళ రంగాల్లో ఉద్యోగాల కల్పన కోసం యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు 2కామ్స్‌తో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఓవర్‌సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీలు ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా జర్మనీలో నర్సులు, మెకట్రానిక్స్, ఎలక్ట్రీషియన్‌ ఉద్యోగాలు, దోహ (ఖతార్‌)లో హోమ్‌ కేర్‌ నర్సుల ఉద్యోగాలకు నైపుణ్య శిక్షణ అందిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.