TG TET Exam: నిరుద్యోగులకు భలే ఛాన్స్‌.. ఇకపై టెట్‌ ఏటా రెండు సార్లు! విద్యాశాఖ జీఓ జారీ

|

Jul 07, 2024 | 2:20 PM

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) ఇకపై ఏడాదికి రెండు సార్లు నిర్వహించనున్నారు. 2015 డిసెంబరు 23న జారీ చేసిన జీఓ 36ను సవరణ చేస్తూ జులై 6 విద్యాశాఖ చీఫ్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం జీఓ 18 జారీ చేశారు. ఈ మేరకు టెట్‌ పరీక్షను ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇక ఏటా జూన్, డిసెంబరులో టెట్‌ పరీక్ష..

TG TET Exam: నిరుద్యోగులకు భలే ఛాన్స్‌.. ఇకపై టెట్‌ ఏటా రెండు సార్లు! విద్యాశాఖ జీఓ జారీ
Telangana TET
Follow us on

హైదరాబాద్‌, జులై 7: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) ఇకపై ఏడాదికి రెండు సార్లు నిర్వహించనున్నారు. 2015 డిసెంబరు 23న జారీ చేసిన జీఓ 36ను సవరణ చేస్తూ జులై 6 విద్యాశాఖ చీఫ్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం జీఓ 18 జారీ చేశారు. ఈ మేరకు టెట్‌ పరీక్షను ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇక ఏటా జూన్, డిసెంబరులో టెట్‌ పరీక్షను జరుపుతామని అందులో వివరించారు.

కాగా ఉమ్మడి రాష్ట్రంలో 2011, 2012లలో రెండుసార్లు టెట్‌ పరీక్ష జరిగింది. ఆ తర్వాత 2014లో టెట్‌ జరిగింది. ఇక 2015లో జారీ చేసిన జీఓ 36లో యేటా రెండేసి సార్లు టెట్‌ పరీక్ష నిర్వహిస్తామని సర్కార్ ప్రగల్భాలు పలికినా.. ఇప్పటి వరకు సార్లు కేవలం 5 సార్లు మాత్రమే పరీక్ష జరిపారు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016, 2017లో టెట్‌ పరీక్ష నిర్వహించారు. అనంతరం 2018 నుంచి 2021 వరకు అసలు టెట్ పరీక్ష ఊసేలేదు. ఆ తర్వాత మళ్లీ 2022, 2023, 2024లో వరుసగా నిర్వహించారు. ఇలా మొత్తం తెలంగాణ పదేళ్ల చరిత్రలో కేవలం ఐదు సార్లు మాత్రమే టెట్‌ పరీక్ష నిర్వహించారు. తాజాగా రేవంత్‌ సర్కార్ మరో మారు యేటా రెండు సార్లు టెట్‌ నినాదంతో నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. కనీసం ఈ ప్రభుత్వం అయినా ఇచ్చని మాట మీద నిలబడుతుందో.. లేదో.. చూడాలి.

ఇక తెలంగాణ టెట్‌ 2024 ఫలితాలు జూన్‌ 12న విడుదలవగా.. భారీగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. తెలంగాణ టెట్ 2024కు మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో పేపర్ 1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో పేపర్‌ 1 పరీక్షకు 57,725 అభ్యర్థులు అంటే 67.13 శాతం మంది అర్హత సాధించారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 51,443 అభ్యర్థులు అంటే 34.18 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. ఇక ఇప్పటికే విడుదలైన 11,062 టీచర్ పోస్టుల మోగా డీఎస్సీకి త్వరలోనే పరీక్షలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.