Schools Reopen: తెలంగాణలో మోగనున్న బడి గంటలు.. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

|

Aug 24, 2021 | 3:03 PM

Schools Reopen Telangana: కరోనా కారణంగా విద్యారంగం తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే. విపరీతంగా కరోనా కేసులు పెరగడంతో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు...

Schools Reopen: తెలంగాణలో మోగనున్న బడి గంటలు.. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
Schools Reopen
Follow us on

Schools Reopen Telangana: కరోనా కారణంగా విద్యారంగం తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే. విపరీతంగా కరోనా కేసులు పెరగడంతో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యాసంస్థలను మూసివేయడంతో పాటు పలు పరీక్షలను సైతం రద్దు చేశాయి. ఇక టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రమోట్‌ చేశాయి. కరోనా తొలి వేవ్‌ రెండో వేవ్‌ కారణంగా ఏకంగా రెండు అకడమిక్‌ ఇయర్‌లపై ప్రభావం పడింది. ఇదిలా ఉంటే తాజాగా పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గుతోంది. దీంతో ప్రభుత్వాలు మళ్లీ పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తులు మొదలుపెట్టాయి.

ఎక్కువ కాలం విద్యార్థులను ఇంటికి పరిమితం సరైన నిర్ణయం కాదని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో తెలంగాణ  ప్రభుత్వం కూడా స్కూళ్ల పునఃప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సెస్టెంబర్‌ 1వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించాలని ఇటీవలే సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయమై అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చాలా రోజుల పాటు మూతపడిన స్కూళ్లు సెప్టెంబర్‌ 1 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.

ఇక వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం ఇంటర్‌లో కనీస అర్హత మార్కుల నిబంధనను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎంసెట్ , ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్‌ పొందాలంటే ఇంటర్‌‌లో పాస్ అయితే చాలు అని పేర్కొంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వార్షిక పరీక్షలు జరగకపోవడం, విద్యార్థులకు పాస్‌ మార్కులు వేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Also Read: AP Weather ఏపీలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

Visakhapatnam: బర్త్ సర్టిఫికేట్, ఆధార్‌ కార్డులు ఇప్పించండి.. మోకరిల్లి వేడుకుంటున్న చిన్నారులు

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు నెక్ట్స్ వన్ ఇయర్ పండగే పండగ.. కారణం ఏంటంటే?