తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో.. తాత్కాలిక ప్రాతిపదికన 239 అతిథి ఉపాధ్యాయుల పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్ధులు సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఇంగ్లిష్ మీడియంలో బోధించవల్సి ఉంటుంది. పాఠశాల క్యాంపస్‌లోనే వసతి సదుపాయం కల్పిస్తారు. అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు దరఖాస్తులు కోరుతూ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ (టీఎస్‌ఈఎస్) ప్రకటన వెలువరించింది. జులై 2, 2023వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సబ్జెక్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, బీఈడీ, పీహెచ్‌డీ, ఎంఫిల్, ఎంఈడీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. బోధననానుభవం కూడా ఉండాలి. జులై 1, 2023వ తేదీ నాటికి వయసు 60 ఏళ్లకు మించకూడదు.
ఈ పోస్టుల నియామకాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. అకడమిక్ మెరిట్, బోధన అనుభవం, టీచింగ్ స్కిల్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,750 నుంచి రూ.34,125ల వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే సమయంలో జనరల్ అభ్యర్ధులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.