Govt Schools: ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరుపై విద్యాశాఖ స్పెషల్‌ ఫోకస్..

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్ధుల హాజరు అతి తక్కువగా ఉన్న జిల్లాల వివరాలను సేకరిస్తుంది. గతేడాది నుంచి విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తక్కువ హాజరు..

Govt Schools: ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరుపై విద్యాశాఖ స్పెషల్‌ ఫోకస్..
Government School Students

Updated on: Aug 10, 2025 | 9:16 PM

హైదరాబాద్‌, ఆగస్టు 10: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్ధుల హాజరు అతి తక్కువగా ఉన్న జిల్లాల వివరాలను సేకరిస్తుంది. గతేడాది నుంచి విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తక్కువ హాజరు నమోదవుతున్న పాఠశాలల గురించి విద్యాశాఖ ఆరా తీస్తోంది. రాష్ట్రంలో మొత్తం 634 మండలాల్లో దాదాపు 1,817 వరకు క్లస్టర్లు (కాంప్లెక్స్‌ స్కూళ్లు) ఉన్నాయి.

వీటిల్లో ప్రతి జిల్లాలో జులై నెలలో సగటున అతి తక్కువ హాజరు ఉన్న 5 క్లస్టర్ల జాబితాను వెలికి తీశారు. వీటి వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ పంపింది. ఈ ఐదింటిలో సగటున 25 నుంచి 55 శాతం మాత్రమే విద్యార్ధుల హాజరు నమోదై ఉంది. దీంతో ఆయా జిల్లాలకు చెందిన కలెక్టర్లు దృష్టి సారిస్తే చాలా వరకు విద్యార్ధుల హాజరు మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఆగస్టు 11ప నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ తొలి విడత సీట్ల కేటాయింపు

దేశంలోని పలు వైద్య కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల కన్వీనర్‌ కోటా సీట్ల ప్రవేశాల కౌన్సెలింగ్‌ గడువు ఆగస్టు 9వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్‌ ఐచ్ఛికాల ప్రక్రియ 9వ తేదీ రాత్రి 11.59 గంటలతో ముగిసింది. ఇక సోమవారం (ఆగస్టు 11) మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇందులో సీట్లు పొందిన విద్యార్ధులు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.