TG EdCET and PGCET Counselling: తెలంగాణ ఎడ్‌సెట్‌, పీఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలు ఇవే

|

Jul 28, 2024 | 2:12 PM

తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలు నిర్వహించడానికి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఎడ్‌సెట్‌ ద్వారా బీఈడీ కాలేజీల్లో, పీఈసెట్‌ ద్వారా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం జులై 31 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది. ఈ మేరకు టీజీ ఎడ్‌సెట్‌, టీజీ పీఈసెట్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను..

TG EdCET and PGCET Counselling: తెలంగాణ ఎడ్‌సెట్‌, పీఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలు ఇవే
TG Edcet and PGCET Counselling
Follow us on

హైదరాబాద్‌, జూలై 28: తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలు నిర్వహించడానికి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఎడ్‌సెట్‌ ద్వారా బీఈడీ కాలేజీల్లో, పీఈసెట్‌ ద్వారా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం జులై 31 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది. ఈ మేరకు టీజీ ఎడ్‌సెట్‌, టీజీ పీఈసెట్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి విడుదల చేశారు. డీపీఎడ్, బీపీఎడ్‌ సీట్ల భర్తీకి ఆగస్టు 7 నుంచి పీఈసెట్ కౌన్సెలింగ్‌, బీఈడీ సీట్ల భర్తీకి ఆగస్టు 8 నుంచి ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది.

ఎడ్‌సెట్‌కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆగస్టు 8 నుంచి 20 వరకు కొనసాగుతుంది. ఆగస్టు 22, 23 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు, ఆగస్టు 24న ఎడిట్‌ ఆప్షన్స్‌ అందుబాటులో ఉంటుంది. తొలి దశ సీట్ల కేటాయింపు ఆగస్టు 30న విడుదల చేస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 4వరకు రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇక పీఈసెట్ కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆగస్టు 7 నుంచి 14 వరకు ఉంటుంది. ఆగస్టు 16, 17న వెబ్‌ ఆప్షన్స్‌, ఆగస్టు 18న ఎడిట్‌కు అవకాశం ఉంటుంది. ఆగస్టు 20న తొలిదశ సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 21 నుంచి 24 వరకు సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.

తెలంగాణ నర్సింగ్, పారా మెడికల్‌ ఫీజులు రెట్టింపు

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ నర్సింగ్, పారా మెడికల్‌ కాలేజీల ఫీజులు పెరిగాయి. ఈ మేరకు ఫీజులను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ సిఫారసుల మేరకు కొత్త ఫీజులను నిర్ణయించామని, పెరిగిన ఫీజులు 2026 వరకు అమలవుతాయని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. యోత్తం 13 కోర్సులకు కొత్త ఫీజులు వర్తిస్తాయని అన్నారు. ఈ 13 కోర్సులకు సంబంధించి ఎ-కేటగిరి, బి-కేటగిరి సీట్ల ఫీజులు ఖరారు చేశారు. బీఎస్సీ నర్సింగ్‌కు ఎ-కేటగిరిలో గతంలో రూ.24 వేలు ఫీజు ఉంటే.. అది తాజాగా రూ.45 వేలకు పెరిగింది. బి-కేటగిరి సీటుకు రూ.90 వేలుకి పెరిగింది. పారా మెడికల్‌ కోర్సుల్లో ఎ-కేటగిరి సీట్లకు గతంలో రూ.21 వేల ఫీజు ఉంటే.. ఇప్పుడు రూ.30 వేలకు పెరిగింది. రూ.16 వేల నుంచి 40 వేలకు, రూ.14 వేల నుంచి రూ.27 వేలకు ఫీజులు పెరిగాయి. దాదాపు ఫీజులన్నీ రెట్టింపయ్యాయి. ఎమ్మెస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సుల ఫీజులు ఏడాదికి రూ.5 వేల చొప్పున పెరిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.