Telangana ECET Results 2024: తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే! టాప్ ర్యాంకర్లు వీరే

|

May 20, 2024 | 12:54 PM

తెలంగాణ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈసెట్‌)-2024 ఫలితాలు సోమవారం (మే 20) విడుదలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ లింబాద్రి, ఓయూ విసి రవీందర్ ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష  రాసిన అభ్యర్ధులు  అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొత్తం 23,330 మంది పరీక్ష రాయగా.. వారలిఓ 22, 365 మంది క్వాలిఫై..

Telangana ECET Results 2024: తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే! టాప్ ర్యాంకర్లు వీరే
TS ECET Results
Follow us on

హైదరాబాద్‌, మే 20: తెలంగాణ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈసెట్‌)-2024 ఫలితాలు సోమవారం (మే 20) విడుదలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ లింబాద్రి, ఓయూ విసి రవీందర్ ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష  రాసిన అభ్యర్ధులు  అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొత్తం 23,330 మంది పరీక్ష రాయగా.. వారలిఓ 22, 365 మంది క్వాలిఫై అయ్యారు. అంటే ఈ-సెట్ లో 95.86% ఉత్తీర్ణత నమోదైంది. బీఎస్సీ మాథ్స్ లో పెద్దపల్లి కి చెందిన యాదగిరి తెలంగాణ రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించాడు. మీర్ ఐజాజ్ అలి సెకెండ్ ర్యాంక్ సాధించాడు. ఇక కెమికల్ ఇంజినీరింగ్ లో విశాఖకు చెందిన బంక మనోహర్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.

తెలంగాణ ఈసెట్ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాగా తెలంగాణ ఈ సెట్‌ పరీక్షను మే 6వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 99 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. 24,272 మంది అభ్యర్థులు ఈసెట్ పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 200 మార్కులకు గానూ ఆన్‌లైన్ విధానంలో ఈ రాత పరీక్ష జరిగింది. ఇంజినీరింగ్, ఫార్మసీ, బీస్సీ మ్యాథమెటిక్స్ విభాగాలకు వేర్వేరుగా 3 గంటల సమయంలో ఈ పరీక్ష జరిగింది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఈసెట్‌ 2024 పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్‌) విద్యార్థులకు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షకు సంబంధించి ఫలితాలతోపాటు తుది ఆన్సర్‌ కీని కూడా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఫలితాల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి లేటరల్ ఎంట్రీ ద్వారా ఆయా బ్రాంచుల్లో బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.