TS ECET 2024 Exam: సోమవారం తెలంగాణ ఈసెట్ ప్రవేశ పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

|

May 05, 2024 | 4:15 PM

తెలంగాణ ఈసెట్ (టీఎస్‌ ఈసెట్‌-2024) ప్రవేశ పరీక్ష సోమవారం (మే 6వ తేదీన) జరగనుంది. ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్ష సమయానికి గంటన్నర ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఈసెట్‌ కన్వీనర్‌ చంద్రశేఖర్‌ ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచించారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు..

TS ECET 2024 Exam: సోమవారం తెలంగాణ ఈసెట్ ప్రవేశ పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
TS ECET 2024 Exam
Follow us on

హైదరాబాద్‌, మే 5: తెలంగాణ ఈసెట్ (టీఎస్‌ ఈసెట్‌-2024) ప్రవేశ పరీక్ష సోమవారం (మే 6వ తేదీన) జరగనుంది. ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్ష సమయానికి గంటన్నర ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఈసెట్‌ కన్వీనర్‌ చంద్రశేఖర్‌ ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచించారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 99 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. వీటిల్లో తెలంగాణ జిల్లాల్లో 48, హైదరాబాద్‌ రీజియన్‌లో 44, ఏపీలో మరో 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమతోపాటు హాల్‌టికెట్‌ తప్పనిసరిగా పరీక్ష కేంద్రాలకు తీసుకురావాలన్నారు. హాల్‌ టికెట్‌ లేకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష హాల్‌లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అలాగే ఏదైనా గుర్తింపు కార్డు అంటే ఆధార్‌ కార్డు, కాలేజీ ఐడీ కార్డు, పాన్‌ కార్డు, పాస్‌పోర్ట్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి వాటిల్లో ఏదైనా ఒకటి చూపించాలని అన్నారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, క్యాలికులేటర్లు, సెల్‌ఫోన్లు, డిజిటల్‌ వాచ్‌లను అనుమతించబోన్నారు.

మే రెండో వారంలో ట్రిపుల్ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక యూనివర్సిటీ (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ పీయూసీ-బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ మే రెండో వారంలో విడుదలకానుంది. ఈ ప్రకటన కింద ఆర్కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. వీలైనంత త్వరగా ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించడానికి వర్సిటీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మొత్తం 4,400 సీట్లను భర్తీ చేయనున్నారు. ప్రవేశాల ప్రక్రియ అనంతరం జులైలో తరగతులు ప్రారంభంకానున్నాయి. ఆర్జీయూకేటీ ప్రవేశాల్లో రాష్ట్ర విద్యార్థులకు 85%, మిగిలిన 15% సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తారు. పదో తరగతి పాసైన విద్యార్థులు మాత్రమే ప్రవేశాలకు అర్హులు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.