TG EAPCET 2025 Schedule: తెలంగాణ ఈఏపీసెట్ పూర్తి షెడ్యుల్ వచ్చేసింది.. నోటిఫికేషన్‌ విడుదల ఎప్పుడంటే?

| Edited By: Srilakshmi C

Feb 03, 2025 | 3:01 PM

తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మే మొదటి వారంలో ఈ పరీక్షలు ఆన్ లైన్ విధానంలో నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదల తేదీ, అప్లికేషన్ వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..

TG EAPCET 2025 Schedule: తెలంగాణ ఈఏపీసెట్ పూర్తి షెడ్యుల్ వచ్చేసింది.. నోటిఫికేషన్‌ విడుదల ఎప్పుడంటే?
TG EAPCET 2025 Schedule
Follow us on

హైదరాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లను ఉన్నత విద్యా మండలి సోమవారం (ఫిబ్రవరి 3) విడుదల చేసింది. గతంలో ఓవరాల్ సెట్లకు సంబంధించి ఎగ్జామ్ తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి.. నేడు తెలంగాణ EACET , తెలంగాణ పీజీఈసెట్‌లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌లను విడుదల చేసింది. జేఎన్టీయూ హైదరాబాదులో తెలంగాణ ఈఏపీసెట్ 2025 కమిటీ మొదటి భేటీ జరిగింది. ఇందులో వెబ్‌సైట్‌ అప్లికేషన్ స్వీకరణ తేదీలు, ఎగ్జామ్ తేదీలను కమిటీ ఆమోదించిందని EAPCET కన్వీనర్ డీన్ కుమార్ తెలిపారు.

తెలంగాణ EAPCET 2025 షెడ్యుల్ ఇదే..

నోటిఫికేషన్ విడుదల తేదీ: 20-02-2025
అప్లికేషన్ల స్వీకరణ తేదీలు: ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు
అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్ష తేదీలు: ఏప్రిల్ 29,30
ఇంజినీరింగ్ పరీక్ష తేదీలు: మే 2, 3, 4, 5

తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యుల్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ PGECET 2025 షెడ్యుల్ పూర్తి వివరాలు

నోటిఫికేషన్ విడుదల తేదీ: 12-03-2025
అప్లికేషన్ల స్వీకరణ తేదీలు: మార్చి 17 నుంచి మే 19 వరకు
పరీక్ష తేదీలు: జూన్ 16, 17, 18, 19

తెలంగాణ పీజీఈసెట్‌ 2025 షెడ్యుల్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లను ఎగ్జామ్స్ కు వారం ముందు విడుదల చేయనున్నారు. త్వరలోనే ఆయా సెట్ల వెబ్ సైట్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.