TG DSC 2024 Result Date: ఈ వారాంతంలోగా డీఎస్సీ తుది కీ విడుదలకు సన్నాహాలు.. 1:3 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా

|

Aug 28, 2024 | 3:04 PM

తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్షలు (డీఎస్సీ) 2024 పూర్తైనప్పటి నుంచి ఆన్సర్‌ కీపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొన్ని ప్రశ్నలు రిపీట్‌రాగా.. మరికొన్ని ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి. దీంతో ఈ సారి ఏకంగా 28,500 అభ్యంతరాలు వచ్చినట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రాథమిక కీ పై వెల్లడించి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు.. నిపుణుల కమిటీ విశ్లేషించి ఈ వారం చివరి నాటికి తుది కీ రూపొందించే..

TG DSC 2024 Result Date: ఈ వారాంతంలోగా డీఎస్సీ తుది కీ విడుదలకు సన్నాహాలు.. 1:3 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా
TG DSC 2024 Exam Final Answer Key
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 28: తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్షలు (డీఎస్సీ) 2024 పూర్తైనప్పటి నుంచి ఆన్సర్‌ కీపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొన్ని ప్రశ్నలు రిపీట్‌రాగా.. మరికొన్ని ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి. దీంతో ఈ సారి ఏకంగా 28,500 అభ్యంతరాలు వచ్చినట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రాథమిక కీ పై వెల్లడించి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు.. నిపుణుల కమిటీ విశ్లేషించి ఈ వారం చివరి నాటికి తుది కీ రూపొందించే అవకాశం ఉంది. అనంతరం డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షల తుది కీ సెప్టెంబరు 2 నాటికి విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తమైంది. ఈ నెలాఖరులోగా తుది కీ ఇవ్వాలని భావించారు. ఒకవేళ ఆలోగా తుది కీ తయారీలో ఆలస్యం చోటు చేసుకుంటే ఒకట్రెండు రోజుల్లో తుది కీ వెలువరించే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

అనంతరం డీఎస్సీ మార్కులకు, టెట్‌ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్‌ ర్యాంకు లిస్టు విడుదల చేస్తారు. అనంతరం రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. తర్వాత మెరిట్‌ జాబితలోని అభ్యర్ధులకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. డీఈఓలు జిల్లాల వారీగా ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. చివరిగా మెరిట్‌ ఉన్న వారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. క్రీడా కోటా కింద దరఖాస్తు చేసిన వారు సెప్టెంబరు 2 వరకు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న ఆధారాలతో కూడిన పత్రాలను అప్‌లోడ్‌ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఈ సందర్భంగా తెలిపింది.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు బడుల్లో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. జూలై 18 నుంచి ఆగస్టు 13 వరకు తొలి సారిగా డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించించింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. సబ్జెక్టుల వారీగా ప్రాథమిక కీలను ఆగస్టు 13న విడుదల చేసింది. ఆగస్టు 20వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించారు. డీఎస్సీలో అడిగిన ప్రశ్నలపై 28 వేలకుపైగా అభ్యంతరాలు వచ్చాయి. ఒక్కో ప్రశ్నపై పలువురు అభ్యంతరం తెలపడంతో వాటి సంఖ్య వేలల్లో ఉందని అధికారులు తెలిపారు. ఆగస్టు నెలాఖరు నాటికి ఫైనల్‌కీని విడుదల చేసి, ఆపై వెనువెంటనే ఫలితాలు కూడా ప్రకటించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.