Free Coaching For DSC 2024: డీఎస్సీ అభ్యర్ధులకు ఉచిత శిక్షణ.. ఇలా దరఖాస్తు చేసుకోండి

|

Mar 15, 2024 | 4:41 PM

తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు అభ్యర్ధులు కోచింగ్ సెంటర్లతో జాయిన్‌ అయ్యి ముమ్మర ప్రిపరేషన్‌ ప్రారంభించారు. కోచింగ్‌ తీసుకునే ఆర్ధిక స్తోమతలేని వారు ఇళ్లలోనే సన్నద్ధమవుతున్నారు. డీఎస్సీ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే పలు సంస్థలు ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నాయి. తాజాగా డీఎస్సీ సన్నద్ధమయ్యే అభ్యర్థులకు..

Free Coaching For DSC 2024: డీఎస్సీ అభ్యర్ధులకు ఉచిత శిక్షణ.. ఇలా దరఖాస్తు చేసుకోండి
Free Coaching For DSC
Follow us on

హైదరాబాద్‌, మార్చి 15: తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు అభ్యర్ధులు కోచింగ్ సెంటర్లతో జాయిన్‌ అయ్యి ముమ్మర ప్రిపరేషన్‌ ప్రారంభించారు. కోచింగ్‌ తీసుకునే ఆర్ధిక స్తోమతలేని వారు ఇళ్లలోనే సన్నద్ధమవుతున్నారు. డీఎస్సీ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే పలు సంస్థలు ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నాయి. తాజాగా డీఎస్సీ సన్నద్ధమయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌ కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉచిత శిక్షణకు ఏప్రిల్‌ 5లోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. దాదాపు 7000 మంది ఎస్జీటీ అభ్యర్థులకు, 3000 మంది స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.

ఎంపికైన అభ్యర్థులకు రూ.1500 చొప్పున బుక్‌ ఫండ్‌తోపాటు స్టడీ మెటీరియల్‌ ఖర్చును కూడా అందిస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షలు మించకూడదని తెలిపారు. టెట్‌లో అర్హత సాధించి, డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. బీఎడ్‌, టెట్‌, డైట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇతర పూర్తి వివరాలకు 040 24071178, 27077929 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.

ఎస్సీ అభ్యర్ధులకు డీఎస్సీ ఉచిత శిక్షణ

కరీంనగర్‌ పెద్దపల్లి జిల్లా షెడ్యూల్‌ కులాల అభ్యర్ధులకు డీఎస్సీ పరీక్షకు ఉచిత రెసిడెన్షియల్‌ శిక్షణ ఇస్తున్నట్లు షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కరీంనగర్‌ జిల్లా ఉపసంచాలకులు నతానియేల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మార్చి 26వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీరందరికీ ఏప్రిల్ 3వ తేదీ నుంచి జూన్‌ 2వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో అభ్యర్ధులకు భోజనం, వసతి సౌకర్యం కూడా కల్పిస్తామని ఆయన తెలిపారు. ఇతర వివరాలకు 9885218053 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.