Telangana Jobs: వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఏకంగా 80 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీచేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ప్రకటనతో నిరుద్యోగుల్లో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. ఇప్పటికే నిరుద్యోగులు తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతోన్న వారికి శుభవార్త చెప్పింది బీసీ సంక్షేమ శాఖ. ఉద్యోగార్థులకు అండగా నిలచే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 120 చోట్ల స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 11 బీసీ సర్కిళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే భారీ ఎత్తున ఉద్యోగాలను ప్రకటించడంతో ఈ సంఖ్యను పెంచనున్నారు.
స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలను గుర్తించారు. ఇందులో భాగంగా మూడు గదులతో ఒక్కో స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమశాఖ నిర్ణయించింది. అందులో ఒక గదిలో పోటీపరీక్షలకు డిజిటల్ పాఠాలు బోధించనున్నారు. పోటీపరీక్షలు, దానికి సంబంధించిన సిలబస్ ప్రకారం సమయాన్ని నిర్ణయిస్తారు. రెండో గదిని సందేహాల నివృత్తి కోసం కేటాయిస్తారు.
ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. మూడో గదిని ఉద్యోగార్థుల ప్రిపరేషన్‌కు కేటాయిస్తారు. స్టడీమెటీరియల్‌ను కూడా ఉచితంగా అందించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. త్వరలోనే ఈ స్టడీ సెంటర్లను ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు.
బాలీవుడ్‌ను కడిగిపారేసిన ఆర్జీవీ !! కాశ్మీర్ ఫైల్స్ పై వర్మ కామెంట్స్ !!
బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ గన్ ఫైర్ !! సీన్ కట్ చేస్తే.. ఆ బుల్లెట్ కాస్త !!