TS 10th Class Results 2024 Date: తెలంగాణ పదో తరగతి ఫలితాల ప్రకటన తేదీ వచ్చేసిందోచ్.. ఎప్పుడంటే!

|

Apr 21, 2024 | 6:58 AM

ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తు్న్న పదో తరగతి విద్యార్ధులకు ముఖ్య గమనిక. తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 30వ తేదీన లేదా మే 1న విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఫలితాల ప్రకటన గురించి అధికారిక వర్గాలు సమాచారం అందించాయి. పదో తరగతి ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్ధులు తమ వివరాలను నమోదు చేసి..

TS 10th Class Results 2024 Date: తెలంగాణ పదో తరగతి ఫలితాల ప్రకటన తేదీ వచ్చేసిందోచ్.. ఎప్పుడంటే!
TS 10th Class Results 2024 Date
Follow us on

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21: ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తు్న్న పదో తరగతి విద్యార్ధులకు ముఖ్య గమనిక. తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 30వ తేదీన లేదా మే 1న విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఫలితాల ప్రకటన గురించి అధికారిక వర్గాలు సమాచారం అందించాయి. పదో తరగతి ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్ధులు తమ వివరాలను నమోదు చేసి రిజల్ట్స్ చెక్‌ చేసుకోవచ్చు. కాగా 2023-24 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలు మార్చి నెల 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు రాశారు. దాదాపు 2,676 పరీక్ష కేంద్రాలలో నిర్వహించారు. అక్కడక్కగా కొన్ని మాల్‌ ప్రాక్టీస్‌ సంఘటనలు జరిగినప్పటికీ ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా పరీక్షలను పకడ్భందీగా విజయవంతంగా నిర్వహించారు.

ఇందుకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ కూడా శనివారం (ఏప్రిల్ 20)తో ముగిసింది. ఫలితాల డీకోడింగ్‌ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేసి, అనంతరం ఏప్రిల్ 30వ తేదీన లేదంటే మే నెల 1వ తేదీ ఉదయం ఫలితాలను వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్ష ఫలితాల వెల్లడికి అనుమతి కోరుతూ ఎన్నికల సంఘానికి విద్యాశాఖ లేఖ రాసింది. ఇందుకు అనుమతిస్తూ ఎన్నికల సంఘం గ్నీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున మంత్రుల చేతుల మీద కాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇక తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 24) విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఇంటర్ ఫలితాలు ప్రకటించిన అనంతరం పదో తరగతి ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తోంది.  ఆ మేరకు ఏర్పాట్లు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.