TN MRB Field Assistant Recruitment 2022: టీఎన్ ఎంఆర్‌బీలో 172 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు.. చివరితేదీ ఎప్పుడంటే?

|

Jan 15, 2022 | 9:08 PM

TN MRB ఫీల్డ్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ - mrb.tn.gov.inని సందర్శించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

TN MRB Field Assistant Recruitment 2022: టీఎన్ ఎంఆర్‌బీలో 172 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు.. చివరితేదీ ఎప్పుడంటే?
Follow us on

TN MRB Field Assistant Recruitment 2022: తమిళనాడు పబ్లిక్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్‌లో తాత్కాలిక ప్రాతిపదికన ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తమిళనాడు మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. TN MRB ఫీల్డ్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ – mrb.tn.gov.inని సందర్శించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అప్లికేషన్‌లను ఫిబ్రవరి 2, 2022 వరకు సమర్పించాలని కోరింది.

TN MRB ఫీల్డ్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2022 అర్హతలు..
అభ్యర్థి తప్పనిసరిగా ప్లస్-టూ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

ఆసక్తి గల అభ్యర్థులు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా సంస్థలో మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ కోర్సు (ఒక సంవత్సరం వ్యవధి కోర్సు)లో సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

ఫీల్డ్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కోసం పూర్తి అర్హతలను చెక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

TN MRB ఫీల్డ్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2022 ఎంపిక కోసం వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు.

TN MRB ఫీల్డ్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2022: ఎలా దరఖాస్తు చేయాలి?

1. అధికారిక వెబ్‌సైట్‌mrb.tn.gov.inకి వెళ్లాలి

2. రిజిస్టర్ చేసుకోవడానికి మీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌‌తో నమోదు చేసుకోవాలి.

3. ఆ తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. అభ్యర్థి పేరు, ఏ పోస్ట్‌కు అప్లే చేస్తున్నారు, కమ్యూనల్ కేటగిరీ, పుట్టిన తేదీ, చిరునామా, ఈమెయిల్ ఐడీ మొదలైన అన్ని వివరాలను జాగ్రత్తగా నమోదు చేసుకోవాలి. నమోదు చేసిన వివరాలు ఫైనల్‌గా పరిగణిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి పేర్కొన్న చివరి తేదీ తర్వాత ఎటువంటి మార్పులు అనుమతించరు.

4. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మొబైల్ వాలెట్‌ల ద్వారా అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాలి.
5. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటవుట్‌ను తీసుకోవాలి.

TN MRB ఫీల్డ్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2022 వివరాలు

దరఖాస్తులు ప్రారంభం  జనవరి 13, 2022
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 2, 2022
ఖాళీల సంఖ్య 174 పోస్ట్‌లు
పే స్కేల్ నెలకు రూ.18,200 నుంచి రూ.57,900

TN MRB ఫీల్డ్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తు ఫీజు:
ఎస్సీ/ ఎస్‌సీఏ/ ఎస్టీ/ డీఏపీ(పీహెచ్)/ డీడబ్లయూ అభ్యర్థులకు రూ. 300, ఇతరులకు రూ. 600గా నిర్ణయించారు.

Also Read: RRB NTPC Exam 2021 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

విద్యార్థులకు శుభవార్త.. ఆన్‌లైన్ జర్నలిజం కోర్సును ప్రారంభించిన ఇగ్నో.. జనవరి 31 చివరి తేదీ..