
ఒరిస్సాలోని కటక్‌లోనున్న స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ (ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్).. 77 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, ఎంఈడీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.ఆసక్తి కలిగిన వారు జూన్ 7, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులు రూ.800లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, విద్యార్హతలు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.