AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scholarship 2026 : ట్యూషన్ ఫీజు సున్నా.. నెలకు లక్షల్లో స్టైపెండ్! MEXT స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోండిలా!

విదేశాల్లో చదువుకోవాలనే కల చాలా మందికి ఉంటుంది, కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల వెనకడుగు వేస్తుంటారు. సాధారణంగా అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాలకు వెళ్లాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. అయితే, వీటికి భిన్నంగా జపాన్ ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థుల కోసం, ముఖ్యంగా భారతీయుల కోసం పూర్తిగా ఉచిత విద్యను అందిస్తోంది. 'MEXT' (Monbukagakusho) పేరుతో పిలిచే ఈ స్కాలర్‌షిప్ ద్వారా మీరు జపాన్‌లోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఉచితంగా చదువుకోవచ్చు.

Scholarship 2026 : ట్యూషన్ ఫీజు సున్నా.. నెలకు లక్షల్లో స్టైపెండ్! MEXT స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోండిలా!
Mext Scholarship 2026 Japan
Bhavani
|

Updated on: Feb 03, 2026 | 4:55 PM

Share

జపాన్ విద్యా మంత్రిత్వ శాఖ అందించే ఈ స్కాలర్‌షిప్ ఒక ఫుల్లీ ఫండెడ్ ప్రోగ్రామ్. అంటే మీ చదువుకు అయ్యే ట్యూషన్ ఫీజుతో పాటు, మీరు అక్కడ ఉండటానికి అయ్యే ఖర్చులు, మీ విమాన ప్రయాణ ఖర్చులు కూడా జపాన్ ప్రభుత్వమే భరిస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ (UG) నుండి రీసెర్చ్ స్టూడెంట్స్ వరకు వివిధ కేటగిరీల్లో ఈ స్కాలర్‌షిప్ అందుబాటులో ఉంది. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అర్హతలు ఏంటి అనే పూర్తి సమాచారం మీకోసం.

MEXT స్కాలర్‌షిప్ ప్రయోజనాలు :

పూర్తి ఫీజు మినహాయింపు: కోర్సు పూర్తయ్యే వరకు ఒక్క రూపాయి కూడా ట్యూషన్ ఫీజు కట్టనవసరం లేదు.

నెలవారీ స్టైపెండ్: నివసించే ఖర్చుల కోసం నెలకు సుమారు 1,17,000 నుండి 1,45,000 యెన్ల (సుమారు రూ. 65,000 – ₹85,000) వరకు స్టైపెండ్ లభిస్తుంది.

విమాన ఖర్చులు: భారతదేశం నుండి జపాన్ వెళ్ళడానికి మరియు చదువు ముగించుకుని తిరిగి రావడానికి అయ్యే ఎయిర్ ఫేర్ గవర్నమెంటే ఇస్తుంది.

భాషా శిక్షణ: కోర్సు ప్రారంభానికి ముందు జపనీస్ భాష నేర్చుకోవడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు :

అర్హత: అండర్ గ్రాడ్యుయేట్ కోసం 12వ తరగతిలో కనీసం 80% మార్కులు, రీసెర్చ్/పీజీ కోసం బ్యాచిలర్ డిగ్రీలో 70% మార్కులు ఉండాలి.

వయస్సు: అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు 17-25 ఏళ్ల మధ్య, రీసెర్చ్ విద్యార్థులు 35 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక విధానం: దరఖాస్తుల పరిశీలన తర్వాత రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవి సాధారణంగా న్యూఢిల్లీలోని జపాన్ ఎంబసీ లేదా ఇతర కాన్సులేట్లలో జరుగుతాయి.

ముఖ్యమైన తేదీలు: ప్రతి ఏటా ఏప్రిల్ – మే నెలల మధ్య దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. (గమనిక: 2026 అకాడమిక్ ఇయర్ కోసం అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తులు ఇప్పటికే ముగిశాయి, 2027 అడ్మిషన్ల కోసం సిద్ధమవ్వండి).

అప్లై చేయడం ఎలా?

ఆసక్తి గల అభ్యర్థులు భారతదేశంలోని జపాన్ ఎంబసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మీరు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ నివాసితులైతే, చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ ద్వారా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.