SBI Bank Jobs 2025: రాత పరీక్షలేకుండానే ఎస్‌బీఐలో 996 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో ఎంపిక

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ (SCO) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 996 స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది.

SBI Bank Jobs 2025: రాత పరీక్షలేకుండానే ఎస్‌బీఐలో 996 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో ఎంపిక
SBI Specialist Cadre Officers Jobs

Updated on: Dec 03, 2025 | 8:52 AM

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ (SCO) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 996 స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్‌ 2వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు..

  • వీపీ వెల్త్‌(ఎస్‌ఆర్‌ఎం) పోస్టుల సంఖ్య: 506
  • ఏవీపీ వెల్త్‌ (ఆర్‌ఎం) పోస్టుల సంఖ్య: 206
  • కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల సంఖ్య: 284

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి వివిధ విభాగాల్లోని పోస్టులను అనుసరించి 2025 మే 1వ తేదీ నాటికి 20 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 23, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.750 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోండి.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.