SBI Apprentice 2021: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎస్‌బీఐకి చెందిన ముంబయిలోని సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అప్రెంటిస్ ఖాళీలను భర్తీచేయనున్నారు.
* నోటిఫికేషన్‌లో భాగంగా 6100 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 100, తెలంగాణలో 125 పోస్టులున్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు భర్తీ చేసుకోవాలనుకునే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 31.10.2020 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
* అప్రెంటిస్ పోస్టుకు ఎంపికైన వారికి శిక్షణ కాలం ఏడాది పాటు నెలకు రూ.15000 స్టయిపెండ్ అందిస్తారు. ఇతర ఎలాంటి అలవెన్సులు/ప్రయోజనాలు ఉండవు.
* అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* రాత పరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. వీటిలో మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత ఉంటుంది. ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 06-07-2021న ప్రారంభంకాగా చివరి తేదీగా 26.07.2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Harwinder Kaur : ఆమె సంకల్పం ముందు ‘హైట్’ తలవంచింది..! లాయర్‌గా మారిన 3 అడుగుల యువతి..