SSC MTS Recruitment 2021: పదో తరగతిలో ప్రభుత్వ ఉద్యోగాలు..దరఖాస్తులకు ఈ రోజే లాస్ట్‌ డేట్‌

|

Mar 21, 2021 | 11:27 AM

SSC MTS Recruitment 2021: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(SSC) మల్టీ టాస్కింగ్‌ (నాన్‌-టెక్నికల్‌) స్టాఫ్‌ (MTS) నోటిఫికేషన్‌ విడుదల విషయం తెలిసిందే. ప్రతి యేటా ఈ నోటిఫికేషన్‌ ద్వారా కేంద్ర...

SSC MTS Recruitment 2021: పదో తరగతిలో ప్రభుత్వ ఉద్యోగాలు..దరఖాస్తులకు ఈ రోజే లాస్ట్‌ డేట్‌
Staff Selection Commission
Follow us on

SSC MTS Recruitment 2021: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(SSC) మల్టీ టాస్కింగ్‌ (నాన్‌-టెక్నికల్‌) స్టాఫ్‌ (MTS) నోటిఫికేషన్‌ విడుదల విషయం తెలిసిందే. ప్రతి యేటా ఈ నోటిఫికేషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వశాఖలు, విభాగాల్లో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేస్తుంటుంది ఎస్సెస్సీ. అయితే పదో తరగతి పాస్‌ అయిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2021 మార్చి 21 చివరి తేదీ. అర్హత ఉన్న, ఆసక్తిగల అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే అభ్యర్థులు ముందుగా https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం కొత్త యూజర్లు Register Nowపైన క్లిక్‌ చేయాలి. అందులో మీ పేరు, పుట్టిన తేదీ, విద్యార్హత తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

తర్వాత కాంటాక్ట్‌ వివరాలు ఎంటర్ చేయాలి. మూడో స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ నెంబర్ జనరేట్‌ అవుతుంది. గతంలో వన్‌టైమ్‌ రిజిస్ట్రేషణ్‌ చేసిన వారు నేరుగా లాగిన్‌ కావచ్చు. రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ద్వారా లాగిన్‌ అయిన తర్వాత మీరు అప్పటికే పూర్తి చేసిన వివరాలు కనిపిస్తాయి. ఆ వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే ఎడిట్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఆ తర్వాత మల్టీ టాస్కింగ్‌ స్టాప్‌ ఎంటీఎస్‌ నోటిషికేషన్‌ దరఖాస్తు చేయాలి. ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. దరఖాస్తు ఫామ్‌ ప్రింట్‌ తీసుకొని భద్రపర్చుకోవాలి.

ఇవీ చదవండి:

Google Pay App FASTag: గూగుల్‌ పేను ఉపయోగించి మీ ఫాస్ట్‌ట్యాగ్‌ను రీఛార్జ్ చేయడం ఎలా..? సులభమైన పద్దతుల్లో…

Digilocker: మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ భద్రంగా దాచుకోండిలా.. ఒక్క యాప్‌తో ఎన్నో సదుపాయాలు