SSVV Recruitment 2021: సంపూర్ణానంద్ సంస్కృత యూనివర్సిటీ నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ..
SSVV Recruitment 2021: సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయం, వారణాసి (SSVV) నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. వివిధ
SSVV Recruitment 2021: సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయం, వారణాసి (SSVV) నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. వివిధ సబ్జెక్ట్‌ల ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ssvv.ac.in ని సందర్శించడం ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం.. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, హెడ్ లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, డైరెక్టర్ (రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) వివిధ సబ్జెక్టుల పోస్టులు మొత్తం కలిపి 90 ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు ఒక్కసారి అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌ని పరిశీలించాలి. ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తే దరఖాస్తు ఫారం రిజెక్ట్ చేస్తారు.
ఇలా అప్లై చేయండి.. అర్హులైన అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ssvv.ac.inలో ఉన్న దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు ఈ ఫారమ్‌ని పూర్తిగా నింపి 15 సెప్టెంబర్ 2021 లోపు రిజిస్ట్రార్, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయ (SSVV), వారణాసి -221002 కి పంపించాలి. పోస్ట్ పేరు, క్యాడర్, సబ్జెక్ట్ వివరాలను అప్లికేషన్ ఎన్వలప్‌లో కచ్చితంగా రాయాలి.
పోస్టుల వివరాలు..
1. ప్రొఫెసర్ – 11 పోస్టులు 2. అసోసియేట్ ప్రొఫెసర్ – 7 పోస్టులు 3. అసిస్టెంట్ ప్రొఫెసర్ – 56 పోస్టులు 4. హెడ్లైబ్రేరియన్ – 1 పోస్ట్ 5. అసిస్టెంట్ లైబ్రేరియన్ – 14 పోస్టులు 6. డైరెక్టర్ (రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) – 1 పోస్ట్
ఫీజు చెల్లింపులు.. అప్లికేషన్‌తో పాటు అభ్యర్థులు దరఖాస్తు రుసుము, బ్యాంక్ డ్రాఫ్ట్‌ను జతచేసి పంపించాలి. యూనివర్సిటీ నిర్దేశించిన దరఖాస్తు రుసుము రూ.1500. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు రూ.1000 మాత్రమే.