Delhi Police Head Constable Recruitment 2022: భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2022 కు అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్ధులను హెడ్ కానిస్టేబుల్ (Ministerial Head Constable) పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టులు: 835
పోస్టుల వివరాలు: హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)
ఖాళీల వివరాలు:
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు 25,500ల నుంచి 81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. అలాగే ఇంగ్లిష్ లేదా హిందీ టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష (CBT), ఫిజికల్ టెస్ట్స్, టైపింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: రాత పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. 90 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ హిందీ, ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే ఉంటుంది.
విభాగాల వారీగా ప్రశ్నలు:
దరఖాస్తు విధానం: ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 16, 2022 (అర్థ రాత్రి 23:00 గంటల వరకు)
రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. https://ssc.nic.in లేదా https://delhipolice.gov.in
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.