
కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPFs), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF), అస్సాం రైఫిల్స్ (AR) లలో కానిస్టేబుల్ (GD), రైఫిల్‌మ్యాన్ (GD)లలో.. 25,487 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి పరీక్షలో జనవరి 1, 2026 నాటికి లేదా అంతకు ముందు ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు పరిమితి జనవరి 01, 2026 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు జనవరి 02, 2003 కంటే ముందు జనవరి 1, 2008 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 3 ఏళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్ (ESM) అభ్యర్థులకు 3 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో గడువు తేదీలోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. SSC కొత్త వెబ్‌సైట్ (https://ssc.gov.in) లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద ప్రతిఒక్కరూ రూ.100 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), వైద్య పరీక్ష (DME)/ వైద్య పరీక్ష (RME), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), CBEలోని మెరిట్, అభ్యర్థులు ఎంచుకున్న ఫోర్స్ ప్రాధాన్యత ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. NCC సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు ప్రోత్సాహక/బోనస్ మార్కులు ఉంటాయి.