ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లలో సబ్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష-2023 నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1876 సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులను భర్తీ చేయనున్నారు. సీఏపీఎఫ్‌లోని 1714 సబ్-ఇన్‌స్పెక్టర్ (జీడీ) పోస్టులను బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలలో భర్తీ చేస్తారు. ఆసక్తి కలిగిన పురుషులు/ మహిళలు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాచిలర్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అలాగే ఆగస్టు 1, 2023వ తేదీ నాటికి వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆగస్టు 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీకి చెందిన వారు రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఇతరులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (సీఎస్‌టీ), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఈ ఏడాది అక్టోబర్‌లో ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
అధికారిక వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.