SSC CGL 2025 Exam Date: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఎస్సెస్సీ సీజీఎల్‌ రాత పరీక్షల కొత్త తేదీలు వచ్చేశాయ్‌! పూర్తి షెడ్యూల్‌ ఇదే

వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద 14,582 గ్రూప్ B, గ్రూప్ C పోస్టులను భర్తీ చేయనుంది. అయితే తాజాగా టైర్‌ 1 రాత పరీక్షకు..

SSC CGL 2025 Exam Date: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఎస్సెస్సీ సీజీఎల్‌ రాత పరీక్షల కొత్త తేదీలు వచ్చేశాయ్‌! పూర్తి షెడ్యూల్‌ ఇదే
SSC CGL Tier 1 Revised Exam Date

Updated on: Sep 03, 2025 | 8:20 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3: దేశంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద 14,582 గ్రూప్ B, గ్రూప్ C పోస్టులను భర్తీ చేయనుంది. అయితే తాజాగా టైర్‌ 1 రాత పరీక్షకు సంబంధించిన తేదీలను కమిషన్ విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 26, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ పోస్టులకు దేశ వ్యాప్తంగా దాదాపు 28 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు దాదాపు 7 నుంచి 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను SSC విడుదల చేస్తుంది. ఈ స్లిప్ ద్వారా అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష నగరం, ఖచ్చితమైన పరీక్ష తేదీని చెక్‌ చేసుకోవచ్చు. ఇక పరీక్షకు సరిగ్గా 2–3 రోజుల ముందు SSC CGL టైర్ 1 అడ్మిట్ కార్డ్‌లు జారీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎస్సెస్సీ సీజీఎల్‌ రాత పరీక్షల కొత్త షెడ్యూల్ 2025 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

అడ్మిట్ కార్డ్‌లో రిపోర్టింగ్ సమయం, పరీక్ష నగరం, షిఫ్ట్ వివరాలు ఉంటాయి. పరీక్ష కేంద్రాలకు వెళ్లే ముందు చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్‌తో తప్పనిసరిగా తీసుకెళ్లాలి. కాగా SSC CGL 2025 నియామక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. టైర్ 1లో అర్హత సాధించిన వారిని టైర్ 2 పరీక్షకు అనుమతిస్తారు. ఈ ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ ఉండదు. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ ను  చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.