SSC CGL 2024 Exam Date: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్‌ టైర్-1 పరీక్ష తేదీలు విడుదల.. త్వరలో అడ్మిట్‌కార్డులు

|

Aug 09, 2024 | 7:17 AM

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (CGL) టైర్ 1 పరీక్ష-2024 తేదీలు విడుదలయ్యాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటనను జారీ చేసింది. తాజా ప్రకటన ప్రకారం దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో..

SSC CGL 2024 Exam Date: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్‌ టైర్-1 పరీక్ష తేదీలు విడుదల.. త్వరలో అడ్మిట్‌కార్డులు
SSC CGL 2024 Exam Date
Follow us on

న్యూఢిల్లీ, ఆగస్టు 9: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (CGL) టైర్ 1 పరీక్ష-2024 తేదీలు విడుదలయ్యాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటనను జారీ చేసింది. తాజా ప్రకటన ప్రకారం దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో సెప్టెంబర్‌ 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ పరీక్షలు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే అడ్మిట్‌కార్డులు కూడా విడుదలకానున్నాయి. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (CGL) పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో మొత్తం 17,727 ఖాళీలను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. టైర్-1 పరీక్ష అనంతరం టైర్ 2 పరీక్ష, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ మెజర్‌మెంట్స్‌, మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

టైర్-1 పరీక్ష ఎలా ఉంటుందంటే..

కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ టైర్-1 పరీక్షకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 50 మార్కులకు ప్రశ్నాపత్రం వస్తుంది. ఈ పరీక్ష 1 గంట వ్యవధిలో రాయవల్సి ఉంటుంది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ టైర్-1 పరీక్ష తేదీలకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల

తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షకు సంబంధించిన మెరిట్‌ జాబితా విడుదలైంది. ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు టీజీపీఎస్సీ మెరిట్‌ జాబితాను విడుదల చేసింది. దివ్యాంగ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో ఎంపిక చేసింది. వీరందరికీ సెప్టెంబరు 20 నుంచి 26 వరకు టీజీపీఎస్సీ కార్యాలయంలో ధ్రువీకరణ పరిశీలన నిర్వహించనున్నట్లు కమిషన్‌ పేర్కొంది. పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా, ధ్రువపత్రాల పరిశీలన షెడ్యూలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. మెరిట్‌ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబరు 19 నుంచి 28 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవల్సి ఉంటుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.