SAI Recruitment 2022: బీఈ/బీటెక్ అర్హతతో నెలకు రూ. లక్ష జీతంతో.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ (Ministry of Youth Affairs and Sports)కు చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ కన్సల్టెంట్ పోస్టుల (Junior Consultant Posts)..
SAI Junior Consultant Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ (Ministry of Youth Affairs and Sports)కు చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ కన్సల్టెంట్ పోస్టుల (Junior Consultant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 7
పోస్టుల వివరాలు: జూనియర్ కన్సల్టెంట్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.80,250ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: బీటెక్/బీఈ/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 22, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: