Southern Railway Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌/ఐటీఐ అర్హతో దక్షిణ రైల్వేలో 3154 అప్రెంటిస్‌ పోస్టులు.. ఏపీలో ఎన్ని ఖాళీలున్నాయంటే..

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన సౌతర్న్‌ రైల్వేలో 3154 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

Southern Railway Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌/ఐటీఐ అర్హతో దక్షిణ రైల్వేలో 3154 అప్రెంటిస్‌ పోస్టులు.. ఏపీలో ఎన్ని ఖాళీలున్నాయంటే..
Southern Railway Recruitment 2022

Updated on: Oct 14, 2022 | 5:05 PM

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన దక్షిణ రైల్వేలో 3154 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతోపాటు తమిళనాడు, పుదుఛ్చేరి, కేరళ, అండమాన్‌ నికోమార్‌, లక్షద్వాప్‌ ఐలాండ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిట్టర్‌, వెల్డర్‌, పెయింటర్‌, రేడియోలజీ, పాథాలజీ, కార్డియోలజీ, కార్పెంటర్, ఎమ్‌ఎమ్‌వీ, మెషినిస్ట్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, వైర్‌మ్యాన్, టర్నర్, అడ్వాన్స్‌డ్‌ వెల్డర్ తదితర ట్రేడుల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 31, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు కింది విధంగా స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్‌ చేసుకోవచ్చు.

  • పదో తరగతి పాసైన అభ్యర్ధులకు రూ.6000
  • ఇంటర్మీడియట్ అభ్యర్ధులకు రూ.7000
  • ఐటీఐ అభ్యర్ధులకు రూ.7000

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.