Southern Railway Recruitment 2021: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సదరన్ రైల్వే, చెన్నై డివిజన్‌లో మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషనలో భాగంగా పలు మెడికల్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. కరోనా సంక్షోభ సమయంలో వైద్య సేవలను మెరుగు పరిచే క్రమంలో వైద్య సిబ్బందిని పెంచే ఉద్దేశంతో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
మెడికల్ ప్రాక్టీషనర్ (డాక్టర్లు)..
* నోటిఫికేషన్‌లో భాగంగా 16 మంది మెడికల్ ప్రాక్టీషనర్ (డాక్టర్లు) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎబీబీఎస్ ఉత్తీర్ణతో పాటు ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 75000 వేతనంగా అందిస్తారు.
నర్సింగ్ స్టాఫ్..
* మొత్తం 16 నర్సింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జీఎన్ఎం/బీఎస్సీ (నర్సింగ్) విభాగంలో జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీలో ఉత్తీర్ణత సాధించాలి. అంతేకాకుండా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
* పైన తెలిపన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 01.05.2021 నాటికి 20-40 ఏళ్ల మధ్య ఉండాలి.
* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారు. అనంతరం మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు 13.05.2021 (గురువారం) చివరి తేదీగా నిర్ణయించారు.
ఈ కోర్సులు చేసిన యువతకు మంచి అవకాశాలు..! కరోనా వల్ల పెరిగిన డిమాండ్..?