నిరుద్యోగులకు శుభవార్త.. సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 61 ఎగ్జిక్యూటివ్, 199 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఇంటర్నర్ రిక్రూట్‌మెంట్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అంటే సంస్థలో ఇప్పటికే పనిచేస్తున్న అభ్యర్థులతోనే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 3 నుంచి 13లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. అలాగే దరఖాస్తు హార్డ్‌కాపీలకు, అవసరమైన అన్ని డాక్యుమెంట్లు జతచేసి వారివారి విభాగాల అధిపతులకు మార్చి 16లోగా సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఈఈఈ పూర్తి చేసి.. 3 ఏళ్ల అనుభవం ఉంటే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అలాగే మిగిలిన పోస్టులకు పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీటెక్ పూర్తి చేసి ఉండాలి. వీటికి ఎలాంటి వయోపరిమితి వర్తించదు. రాతపరీక్ష, అసెస్‌మెంట్ రిపోర్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఈ క్రమంలో రాతపరీక్షకు 85 మార్కులు, అసెస్‌మెంట్ రిపోర్టుకు 15 మార్కులు ఉంటుంది. వీటి ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు Director(PA & W), Kothagudem అడ్రస్ కు.. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు General Manager(Personnel) Welfare & RC, Kothagudem చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
ఖాళీల సంఖ్య: 260
ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 61
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 199
ఎంపిక విధానం: రాతపరీక్ష, అసెస్‌మెంట్ రిపోర్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. రాతపరీక్షకు 85 మార్కులు, అసెస్‌మెంట్ రిపోర్టుకు 15 మార్కులు మదింపు ఉంటుంది. దీని ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది.
సింగరేణి ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.