ఓవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు పోతాయనే టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి కూడా. అయితే ఇదే సమయంలో ఓ వార్త భారతీయ యువతకు ఊరటనిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల కారణంగా భారత్ సెమీకండక్టర్ల తయారీకి కేంద్రంగా మారుతోంది. ఈ పరిశ్రమ అభివృద్ధితో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలను రానున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వచ్చే రెండేళ్లలో అంటే 2026 నాటికి సెమీకండర్ల తయారీ రంగంలో ఏకంగా 10 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్న ఓ నివేదిక చెబుతోంది. చిప్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్‌లో అంచనా ప్రకారం అసెంబుల్, టెస్టింగ్, మార్కెటింగ్, ప్యాకేజీంగ్ రంగాల్లో 3 లక్షల ఉద్యోగాలు రానున్నాయని అంచనా వేస్తున్నారు. అలాగే చిప్ డిజైన్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో 2 లక్షల ఉద్యోగాలు రానున్నాయని ప్రముఖ సిస్టమ్ సర్క్యూట్, తయారీ సంస్థ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ అంచనా వేసింది.
వీరితో పాటు ఇంజనీర్లు, ఆపరేటర్లు, సాంకేతిక నిపుణులు, క్వాలిటీ ఇంజనీర్లు, మెటీరియల్ ఇంజనీరింగ్ నిపుణుల అవసరం పెరుగుతుంది. సెమీకండక్టర్ పరిశ్రము ప్రభుత్వం మద్ధతు ఇవ్వడంతోపాటు, అనేక ప్రైవేట్ కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే సెమీకండక్టర్ తయారీ పరిశ్రమకు నైపుణ్యలేమి లోటు ఇబ్బంది పడుతోందని నివేదికలో వెల్లడుంది. అభివృద్ధి చెందుతోన్న సెమీకండక్టర్ల పరిశ్రమకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించేందకు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు ఉపయోగపడతాయని ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ సీఈఓ సచిన్ అలుగ్ అన్నారు. ఈ ఇంటర్న్‌షిప్‌లు విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరుస్తాయని, అంతిమంగా భారత సెమీకండక్టర్ రంగానికి ఇది ఎంతో దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని విద్య, ద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..