Indian Mint: మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు..

|

Jan 30, 2022 | 10:04 AM

Indian Mint Recruitment: సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(SPMCIL)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగ విభాగానికి చెందిన ఆ సంస్థ ముంబ‌యిలోని మింట్ ప‌లు పోస్టుల‌ను భర్తీ చేయ‌నున్నారు...

Indian Mint: మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు..
Follow us on

Indian Mint Recruitment: సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(SPMCIL)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగ విభాగానికి చెందిన ఆ సంస్థ ముంబ‌యిలోని మింట్ ప‌లు పోస్టుల‌ను భర్తీ చేయ‌నున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 15 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ బులియన్‌ అసిస్టెంట్‌, ఎంగ్రేవర్‌, జూనియర్‌ టెక్నీషియన్ ఖాళీలు ఉన్నాయి.

* సెక్రటేరియల్‌ అసిస్టెంట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 28 ఏళ్లు మించ‌కూడ‌దు.

* జూనియర్‌ బులియన్‌ అసిస్టెంట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఇంగ్లిష్‌/ హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 28 ఏళ్లు మించ‌కూడ‌దు.

* ఎంగ్రేవర్ పోస్టుల‌కు కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వ‌య‌సు 28 ఏళ్లు మించ‌కూడ‌దు.

* జూనియర్‌ టెక్నీషియన్ పోస్టుల‌కు అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 25 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను ఆన్‌లైన్‌ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ 31-01-2022న ప్రారంభ‌మ‌వుతుండ‌గా, 01-03-2022ని చివరి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Petrol Diesel Price: స్థిరంగా కొన‌సాగుతోన్న‌ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. కొన్ని చోట్ల మాత్రం స్వ‌ల్పంగా త‌గ్గాయి..

NIPER Recruitment: హైద‌రాబాద్ నైప‌ర్‌లో ఉద్యోగాలు.. అభ్య‌ర్థుల‌ను ఎలా ఎంపిక చేస్తారంటే..

Cold Hit Alert: రికార్డుస్థాయిలో పెరుగుతున్న చలి తీవ్రత.. మరో రెండు రోజులు తప్పదంటున్న వాతావరణ శాఖ