Secunderabad Military College Recruitment 2021: సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో ఉన్న మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ల్యాబొరేటరీ అటెండెంట్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 14,950 జీతంగా చెల్లిస్తారు.
* జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణతను అర్హతగా ఉంచారు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 17,250 చెల్లిస్తారు.
* సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.18,400 చెల్లిస్తారు.
* లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు లైబ్రరీ సైన్సెస్/ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్‌లో సర్టిఫికెట్ కోర్సు/ లైబ్రరీ సైన్స్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. ఎంపికైన వారికి నెలకు రూ. 17,250 చెల్లిస్తారు.
* లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అర్హతగా నియమించారు. నెలకు రూ. 14,950 చెల్లిస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పూర్తి వివరాలను.. మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ) గేట్, తిరుమలగిరి, సికింద్రాబాద్ చిరునామాకు పంపించాలి.
* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తులకు చివరి తేదీగా 18.05.2021ని నిర్ణయించారు.
* ఇంటర్వ్యూలను మే 20, 2021 రోజున నిర్వహిస్తారు.
Also Read: IPL 2021: నేను కోలుకున్నాను.. IPL 2021 మిగతా మ్యాచ్‌లు జరిగితే ఆడేందుకు రెడీ…
Iron Dome: ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థలో ఐరన్ డోమ్ ఓ అద్భుతం.. ఇది ఎలా పనిచేస్తుందంటే..