Schools Reopen In AP : విద్యార్థుల రాకకోసం పాఠశాలలు సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. కార్పొరేట్ ను మించి అందంగా రూపుదిద్దుకున్నాయి. ఏ స్కూల్లో చూసినా రంగురంగుల బొమ్మలు దర్శనమిస్తున్నాయి. ఆహ్లాదకర వాతావరణం, కూర్చోడానికి రాసుకోవడానికి బెంచీలు, తొమ్మిది రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ ఉండేవి కావు. బాలికల పరిస్థితి అసలు చెప్పనక్కర్లేదు. నీళ్లు రాణి కొళాయిలు దర్శనమిచ్చేవి. ఇప్పుడు అలాంటి కష్టాలు చాలావరకు తీరిపోయాయి. తొమ్మిది రకాల సౌకర్యాలు స్కూల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. నిత్యం మంచినీటి సరఫరా, టాయిలెట్స్, స్పోర్ట్స్ కిట్, బెంచీలు ఏర్పాటు చేశారు. ఆహ్లాదకర వాతావరణం ఉండేలా గోడలకు రంగులు వేసి మంచి బొమ్మలు చిత్రీకరించారు. ప్రతి స్కూల్ కు మంచి ఆటస్థలం ఉంది.
నాడు నేడు మొదటి విడత కింద 2970 స్కూళ్లకు గాను 1 080 స్కూళ్లను అందంగా తీర్చిదిద్దారు. 324 కోట్లు విడుదల చేసి 224 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశారు. దీంతో స్కూల్స్‌కి వెళ్లేందుకు కు విద్యార్థులు అటు పేరెంట్స్ సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూల్స్లో అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే తరగతులు రన్ చేస్తామని, స్కూల్స్ తెరిచేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. స్కూళ్లలోని క్లాస్ రూంలు, స్టాఫ్ రూమ్స్‌లో సోడియం హైపోక్లోరైడ్, బ్లీచింగ్ చల్లిస్తున్నారు. ఇక స్కూళ్లలో కొవిడ్‌కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులు క్లాస్ రూంలలో భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశామన్నారు.