న్యూఢిల్లీ, అక్టోబర్ 25: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ముంబాయి ప్రధనా కేంద్రంగా పనిచేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తర్వలో భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. త్వరలో క్లర్క్ ఉద్యోగాలకు ఎస్‌బీఐ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అలాగే దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడీబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ రాత పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది), సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి బేసిక్ పే కింద నెలకు రూ.19,900 అందుతుంది. కాగా గతేడాది 5,008 జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దసరా సెలవులు ముగిశాయి. దీంతో అన్ని పాఠశాలలు అక్టోబరు 25 నుంచి పునఃప్రారంభం అయ్యాయి. అన్ని విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ హాజరు విధానానికి సంబంధించిన విధివిధానాలను తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు ఉదయం 9:00 కల్లా ఉపాధ్యాయులు హాజరు వేసేయాలి.. అందుకు సంబంధించిన వివరాలను యాప్‌లో ఉదయం 9.30 గంటల్లోపు పూర్తి చేయాలని పేర్కొంది. ప్రత్యేక విధులకు దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లినప్పటి నుంచి మళ్లీ హాజరు వేయాల్సి ఉంటుంది. ఇక లీవ్ పెట్టుకోవాలనుకునే ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలలోపు యాప్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఈ నిబంధనలను పాటించని వారికి మెమోలు జారీ చేస్తామని అని ఐటీ సెల్ ఆదేశాలను జారీ చేసింది. ఈ క్రమంలో పాఠశాల హాజరు యాప్‌ను అప్‌డేట్ చేసినట్లు పేర్కొంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం కోసం క్లిక్ చేయండి.