Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DRDO Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం పొందే అవకాశం.

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 51 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సైంటిస్ట్‌ సీ 27 ఖాళీలు, సైంటిస్ట్ డీ 8 పోస్టులు, సైంటిస్ట్ ఈ 14, సైంటిస్ట్ ఎఫ్‌ 2 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్‌ డిగ్రీలో ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత స్ట్రీమింగ్స్‌లో డిగ్రీని పూర్తి చేయాలి. అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు. సైంటిస్ట్‌ సీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే...

DRDO Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం పొందే అవకాశం.
DRDO Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 25, 2023 | 2:03 PM

DRDO recruitment 2023: డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ సంస్థకు చెందిన రీసెర్చ్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎలా ఎంపి చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 51 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సైంటిస్ట్‌ సీ 27 ఖాళీలు, సైంటిస్ట్ డీ 8 పోస్టులు, సైంటిస్ట్ ఈ 14, సైంటిస్ట్ ఎఫ్‌ 2 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్‌ డిగ్రీలో ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత స్ట్రీమింగ్స్‌లో డిగ్రీని పూర్తి చేయాలి. అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు. సైంటిస్ట్‌ సీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకూడదు.

ఇదిలా ఉంటే జీతల విషయానికొస్తే సైంటిస్ట్ సీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 67,700, సైంటిస్ట్‌ డీ పోస్టులకు ఎంపికై వారికి నెలకు రూ. 78,800, సైంటిస్ట్‌ ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,23,100, సైంటిస్ట్‌ ఎఫ్‌ పోస్టులకు ఎంపికై వారికి నెలకు రూ. 1,31,100 చెల్లిస్తారు. అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

* ముందుగా రీసెర్చ్‌ అండ్‌ అసెస్మెంట్‌ సెంటర్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అనంతరం ‘కెరీర్‌’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత సైంటిస్ట్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి.

* అనంతరం ‘అడ్వర్టైజ్‌మెంట్‌ నెంబర్‌ 147’ లేబుల్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం సంబంధిత వివరాలన్నింటినీ ఎంటర్ చేయాలి.

* అకౌంట్‌లోకి లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్‌ ఫామ్‌ను ఫిల్‌ చేయాలి.

* అనంతరం పేమెంట్‌ చేసిన తర్వాత అప్లికేషన్‌ ఫామ్‌ సబ్‌మిట్ నొక్కాలి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అప్లికేషన్‌ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పూర్తి వివరాలు, దరఖాస్తు చేసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

తత్కాల్‌ టికెట్ల సమయ వేళలు ఏంటి? రద్దు ఛార్జీల వివరాలు!
తత్కాల్‌ టికెట్ల సమయ వేళలు ఏంటి? రద్దు ఛార్జీల వివరాలు!
ఆ సినిమాలో నగ్నంగా నటించిన హీరోయిన్.. కానీ చివరిలో
ఆ సినిమాలో నగ్నంగా నటించిన హీరోయిన్.. కానీ చివరిలో
నిజం చెప్పాలంటే నేను సరిగ్గా ఆడట్లేదు.. అందుకే..!
నిజం చెప్పాలంటే నేను సరిగ్గా ఆడట్లేదు.. అందుకే..!
సర్వర్ డౌన్ ఉన్నా చెల్లింపులు ఈజీ..యూపీఐలో ఆ ఫీచర్ గురించి తెలుసా
సర్వర్ డౌన్ ఉన్నా చెల్లింపులు ఈజీ..యూపీఐలో ఆ ఫీచర్ గురించి తెలుసా
పది గ్రామాల్లో ఘుమఘుమలాడిన పులుసు వాసనలు..
పది గ్రామాల్లో ఘుమఘుమలాడిన పులుసు వాసనలు..
మీ ఫోన్‌ లాక్‌లో ఉంటే దానికదే రీస్టార్ట్‌.. గూగుల్‌ కొత్త ఫీచర్‌
మీ ఫోన్‌ లాక్‌లో ఉంటే దానికదే రీస్టార్ట్‌.. గూగుల్‌ కొత్త ఫీచర్‌
తొలి సినిమాతోనే వందల కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు ఇతను
తొలి సినిమాతోనే వందల కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు ఇతను
రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయండి చాలు,లాభాలు తెలుసా
రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయండి చాలు,లాభాలు తెలుసా
స్వర్గంలో పూసిన పూలు ఈమె రూపంలో భువికి చేరాయి.. ఫ్యాబులస్ ప్రగ్య.
స్వర్గంలో పూసిన పూలు ఈమె రూపంలో భువికి చేరాయి.. ఫ్యాబులస్ ప్రగ్య.
ఈ ఫ్యాన్లు తిరిగితే హిమపవనాలే.. ఏసీలతో పోటీగా చల్లని గాలి..!
ఈ ఫ్యాన్లు తిరిగితే హిమపవనాలే.. ఏసీలతో పోటీగా చల్లని గాలి..!