ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 9 మేనేజర్ (ప్రోజెక్ట్స్ డిజిటల్ పేమెంట్స్, ప్రొడక్ట్స్ డిజిటల్ పేమెంట్స్/కార్డ్స్, ప్రొడక్ట్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంబీఏ/పీజీడీఎం లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు ఆగస్టు 31, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 12, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. షార్ట్ లిస్టింగ్, ఇంటరాక్షన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.63,840ల నుంచి రూ.78,230ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.