ముంబాయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 16 సెక్టార్ క్రెడిట్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టును బట్టి సీఏ, ఎంబీఏ (ఫైనాన్స్), మాస్టర్ డిగ్రీ(ఫైనాన్స్ కంట్రోల్), మాస్టర్ ఇన్ మేనేజ్‌మెంట్ స్టడీస్, పీజీడీఎం(ఫైనాన్స్) లేదా తత్సమాన డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబందిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు అక్టోబర్ 1, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 29, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చూసేటప్పుడు జనరల్ కేటగిరి అభ్యర్ధులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికై వారు కార్పొరేట్ సెంటర్, ముంబయిలో పనిచేయవల్సి ఉంటుంది. పోస్టును బట్టి నెలకు రూ.63,840ల నుంచి రూ.89,890ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.