Akilesh Yadav On Board Exams: కరోనా నేథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే సీబీఎస్ఈ 12వ తరగతితో పాటు మరికొన్ని పోటీ పరీక్షలను వాయిదా వేశారు. ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే పరీక్షల నిర్వహణపై ఆదివారం కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన వర్చువల్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పాల్గొన్న పలు రాష్ట్రాలకు చెందిన విద్యా శాఖ మంత్రులు, అధికారులు పరీక్షల నిర్వహణపై పలు సలహాలు, సూచనలు చేశారు. అయితే పరీక్షల నిర్వహణ తేదీపై ఇంకా స్పష్టమైన నిర్ణయం రాకపోయినప్పటికీ వచ్చే నెల చివర్లో పరీక్షలను నిర్వహిస్తారని సూచన ప్రాయంగా తెలిసింది.
ఇదిలా ఉంటే పరీక్షలు నిర్వహించాలంటే ముందుగా విద్యార్థులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తెరపైకి కొత్త డిమాండ్‌ను తీసుకొచ్చారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా వ్యాక్సినేషన్ లేకుండా పరీక్షల నిర్వహణ వద్దు (నో ఎగ్జామినేషన్ విత్ అవుట్ వ్యాక్సినేషన్) అనే ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఇక ఆదివారం జరిగిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్నసమాజ్‌వాదీ పార్టీ ఎమ్ఎల్‌సీ ఉదయ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకూడదని తెలిపారని సమాచారం. ఇక ఢిల్లీ, కేరళ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా పరీక్షల కంటే ముందే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనే వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఇక వర్చువల్ మీటింగ్ జరిగన తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ.. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై.. జూన్ 1న నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు.
पहले टीका फिर परीक्षा
No Examination Without Vaccination.
— Akhilesh Yadav (@yadavakhilesh) May 25, 2021