Sainik School Recruitment: మహారాష్ట్రలోని చందాపూర్‌లో ఉన్న సైనిక్ స్కూల్స్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశారు. సైనిక్ స్కూల్స్ సొసైటీకి చెందిన సైనిక్ స్కూల్‌లో రెగ్యులర్, కాంట్రాక్ట్ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 31 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో టీజీటీ (7), ఆఫీస్ సూపరింటెండెంట్ (1),జనరల్ ఎంప్లాయ్ (16), కౌన్సిలర్ (1), మ్యూజిక్ టీచర్ (1), ఆర్ట్ మాస్టర్ (1), వార్డ్ బాయ్(జనరల్ ఎంప్లాయ్/ఎంటీఎస్) (04) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి పదో తరగతి, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
* అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15,000 నుంచి రూ. 40 వేలకుపైగా అందిస్తారు.
* అభ్యర్థులను రాతపరీక్ష, తరగతి గది డెమాన్‌స్ట్రేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా 17-01-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: NMDC Recruitment: ఎన్‌ఎండీసీలో అప్రెంటిస్ పోస్టులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ఎంపిక..
Prabhas: డార్లింగ్ మనసు బంగారం.. రాధేశ్యామ్ ప్రీరిలీజ్‌లో గాయ పడిన అభిమానుల కోసం..
Gandhi Hospital: మరో ఘనత సాధించిన గాంధీ దవాఖాన.. దక్షిణాది నుంచి ఎంపికైన ఏకైక ఆస్పత్రిగా..