SAIL Recruitment: చివరి అవకాశం.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్.
స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న సెయిల్ ప్లాంట్లు, మైన్స్, యూనిట్‌లలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది..
స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న సెయిల్ ప్లాంట్లు, మైన్స్, యూనిట్‌లలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణకు నేటితో (ఆదివారం) గడువు ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 51 మేనేజ్‌మెంట్ ట్రైనీ(అడ్మినిస్ట్రేషన్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ/ సీఏ/ సీఎంఏ/ ఎంబీఏ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18-12-2022 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,80,000 వరకు చెల్లిస్తారు.
* 28-11-2022న మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో (18-12-2022)తో ముగియనుంది.
* ఆన్‌లైన్ పరీక్షను 29-11-2023 తేదీన నిర్వహించనున్నారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..