Central Govt Jobs: టెన్త్, ఇంటర్‌ అర్హతతో సాహిత్య అకాడమీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు జీతం రూ.2 లక్షలకు పైనే

|

Sep 13, 2024 | 7:41 AM

న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీలో డైరెక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద డిప్యూటీ సెక్రటరీ, రీజినల్ సెక్రటరీ, పబ్లికేషన్ అసిస్టెంట్, ప్రోగ్రామ్‌ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, జూనియర్ క్లర్క్, అసిస్టెంట్ ఎడిటర్‌, సబ్‌ ఎడిటర్‌ (ఇంగ్లిష్‌).. తదితర పోస్టులను..

Central Govt Jobs: టెన్త్, ఇంటర్‌ అర్హతతో సాహిత్య అకాడమీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు జీతం రూ.2 లక్షలకు పైనే
Sahitya Akademi
Follow us on

న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీలో డైరెక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద డిప్యూటీ సెక్రటరీ, రీజినల్ సెక్రటరీ, పబ్లికేషన్ అసిస్టెంట్, ప్రోగ్రామ్‌ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, జూనియర్ క్లర్క్, అసిస్టెంట్ ఎడిటర్‌, సబ్‌ ఎడిటర్‌ (ఇంగ్లిష్‌).. తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 12 వరకు ఉన్నియొ. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అన్ని స్థాయిల్లో ఎంపికైతే బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ బ్రాంచుల్లో పని చేయవల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు..

  • డిప్యూటీ సెక్రటరీ పోస్టుల సంఖ్య: 2
  • రీజినల్ సెక్రటరీ పోస్టుల సంఖ్య: 2
  • పబ్లికేషన్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 1
  • ప్రోగ్రామ్‌ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 1
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 పోస్టుల సంఖ్య: 1
  • జూనియర్ క్లర్క్ పోస్టుల సంఖ్య: 1
  • అసిస్టెంట్ ఎడిటర్‌ పోస్టుల సంఖ్య: 1
  • సబ్‌ ఎడిటర్‌ (ఇంగ్లిష్‌) పోస్టుల సంఖ్య: 1
  • ప్రూఫ్‌ రీడర్ కమ్ జనరల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 1
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల సంఖ్య: 1

పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా జర్నలిజం, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 16, 2024వ తేదీలోపు కింది అడ్రస్‌కు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి డిప్యూటీ సెక్రటరీ పోస్టుకు రూ.67,700 నుంచి రూ.2,08,700 వరకు జీతంగా చెల్లిస్తారు. అసిస్టెంట్ ఎడిటర్‌ పోస్టులకు రూ.56,000 నుంచి రూ.1,77,500 వరకు, పబ్లికేషన్ అసిస్టెంట్, సబ్‌ ఎడిటర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు, స్టెనో గ్రాఫర్, పీఆర్‌ కమ్ జనరల్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.25,000 నుంచి రూ.81,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

అడ్రస్:

సెక్రటరీ, సాహిత్య అకాడమీ, రవీంద్ర భవన్‌, 35 ఫిరోజ్‌షా రోడ్, న్యూఢిల్లీ.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.