Teacher Eligibility Test: టెట్‌లో భాషా పండితులకు స్పెషల్‌గా పేపర్‌ 3 పరీక్ష..?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్) హాట్ టాపిక్‌గా మారింది. సాధారనంగా బీఈడీ, డీఎడ్ పూర్తి చేసిన నిరుద్యోగులు టీచర్‌ పోస్టులకు పోటీ పడేందుకు టెట్‌లో అర్హత సాధించవల్సి ఉంటుంది. కానీ నేటి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో..

Teacher Eligibility Test: టెట్‌లో భాషా పండితులకు స్పెషల్‌గా పేపర్‌ 3 పరీక్ష..?
Telangana Teacher Eligibility Test

Updated on: Nov 21, 2025 | 8:32 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 21: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్) హాట్ టాపిక్‌గా మారింది. సాధారనంగా బీఈడీ, డీఎడ్ పూర్తి చేసిన నిరుద్యోగులు టీచర్‌ పోస్టులకు పోటీ పడేందుకు టెట్‌లో అర్హత సాధించవల్సి ఉంటుంది. కానీ నేటి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో సర్వీసుల్లో కొనసాగుతున్న టీచర్లపై కూడా టెట్‌ భారం పడింది. తీర్పు వెలువడిన తేదీ నుంచి వచ్చే రెండేళ్లలో టీజీటీ, స్కూల్ అసిస్టెంట్‌ టీచర్లంతా టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరైంది. దీంతో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. టెట్‌ అర్హత నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలంటూ గగ్గోలు పెడుతున్నారు. తాజాగా ఆయా స్కూళ్లలో సర్వీసులో ఉన్న భాషా పండితులు మరో కొత్త డిమాండ్‌ తెరపైకి తెచ్చారు.

టెట్‌ తప్పనిసరైన నేపథ్యంలో తమకు ప్రత్యేకంగా పేపర్‌ 3 నిర్వహించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌-తెలంగాణ (ఆర్‌యూపీపీటీ) కోరింది. హైదరాబాద్‌ నాంపల్లి హిందీ ప్రచార సభ కార్యాలయంలో ఇటీవల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌ అబ్దుల్లా మాట్లాడుతూ… ప్రస్తుతం భాషా పండితులు రాసే పేపర్‌ 2లో 150 మార్కులకు వారు బోధించే భాషా సబ్జెక్టుకు కేవలం 30 మార్కులు మాత్రమే ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం భాషా సబ్జెక్టులకు 60 మార్కులిచ్చి ప్రత్యేక పేపర్‌ ఇస్తున్నారు. అందువల్ల అద తరహాలోనే తెలంగాణలో కూడా పేపర్‌ విధానం మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల టెట్ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 15వ తేదీ నుంచే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమైనాయి. దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 29, 2025వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. ఇక టెట్ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జనవరి 3 నుంచి 31, 2026వ తేదీ వరకు జరుగుతాయి. టెట్‌ ఫలితాలను ఫిబ్రవరి 10 నుంచి 16వ తేదీల మధ్య వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.