RRCAT Recruitment 2022: రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్డ్స్ టెక్నాలజీలో భారీగా అప్రెంటిస్ ఖాళీలు.. రాత పరీక్షలేకుండానే నేరుగా ప్రవేశం..
కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోని మధ్యప్రదేశ్, ఇండోర్‌లోనున్న రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్డ్స్ టెక్నాలజీ (RRCAT).. 113 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన..
RRCAT Madhya Pradesh Trade Apprentice Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోని మధ్యప్రదేశ్, ఇండోర్‌లోనున్న రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్డ్స్ టెక్నాలజీ (RRCAT).. 113 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధులు నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా నవంబర్ 15, 2000ల నుంచి నవంబర్ 14, 2004 మధ్య జన్మించి ఉండాలి. అంటే దరఖాస్తుదారలు వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే వెల్డర్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, డ్రాఫ్ట్‌మెన్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, కార్పెంటర్, సీఓపీఏ, ప్లంబర్, సర్వేయర్, మాసన్, స్టెనోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర విభాగాల్లో ఐటీఐ సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.11,600ల వరకు స్టైపెండ్ ఇస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు https://www.apprenticeshipindia.org/. లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్దులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
- దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 17, 2022.
- మెరిట్ లిస్టు ప్రకటన తేదీ: ఆగస్టు 29, 2022.
- పైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ: సెప్టెంబర్ 7, 2022.
- అప్రెంటిస్ వ్యవధి: నవంబర్ 15, 2022 నుంచి నవంబర్ 14, 2023 వరకు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.