West Central Railway Recruitment 2022: రాత పరీక్షలేకుండా.. రైల్వేలో 2,521 ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు!

|

Nov 21, 2022 | 5:19 PM

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన వెస్ట్రన్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని వివిధ యూనిట్లలో.. 2,521 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్యూట్‌మెంట్‌ సెల్‌ నోటిఫికేషన్‌..

West Central Railway Recruitment 2022: రాత పరీక్షలేకుండా.. రైల్వేలో 2,521 ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు!
RRC West Central Railway Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన వెస్ట్రన్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని వివిధ యూనిట్లలో.. 2,521 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్యూట్‌మెంట్‌ సెల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కార్పెంటర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ కమ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్, డ్రాఫ్ట్‌మెన్‌ (సివిల్‌), ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, పెయింటర్‌, ప్లంబర్‌, బ్లాక్‌ స్మీత్‌, వెల్డర్‌ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు ఇంటర్మీడియట్‌ లేదా లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ కూడా ఉండాలి. ఇంజనీర్‌ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. అభ్యర్ధుల వయసు నవంబర్‌ 17, 2022వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 17, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయలో జనరల్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. షార్ట్‌లిస్టింగ్‌, అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఖాళీల వివరాలు..

  • జబల్పూర్ డివిజన్‌లో ఖాళీలు: 884
  • భోపాల్ డివిజన్‌లో ఖాళీలు: 614
  • కోట డివిజన్‌లో ఖాళీలు: 685
  • కోటా వర్క్‌షాప్ డివిజన్‌లో ఖాళీలు: 160
  • CRWS BPL డివిజన్‌లో ఖాళీలు: 158
  • HQ/ జబల్పూర్ డివిజన్‌లో ఖాళీలు: 20

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.