RRC Railway Jobs 2025: పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

|

Mar 12, 2025 | 3:47 PM

నిరుద్యోగులకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (RCC) శుభవార్త చెప్పింది. కేవలం పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కులు, సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉంటే చాలు జాబ్‌ మీదే. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..

RRC Railway Jobs 2025: పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
RRC Railway Jobs
Follow us on

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకు చెందిన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) కార్యాలయం, వ్యాగన్ రిపేర్ షాపులలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (RCC) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1,003 అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అలాగే అభ్యర్‌ధుల వయసు మార్చి 3, 2025 నాటికి 15 నుంచి 24 యేళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు పదేళ్ల చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఖాళీల వివరాలు..

DRM ఆఫీస్‌లో ఖాళీల వివరాలు..

  • వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రికల్): 185
  • టర్నర్: 14
  • ఫిట్టర్: 188
  • ఎలక్ట్రీషియన్: 199)
  • స్టెనోగ్రాఫర్ (హిందీ): 8
  • స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్): 13)
  • హెల్త్ & శానిటరీ ఇన్స్పెక్టర్: 32
  • COPA: 10
  • మెషినిస్ట్: 12
  • మెకానిక్ డీజిల్: 34
  • మెకానిక్ రిఫ్రిజిరేషన్ & AC: 11
  • బ్లాక్‌స్మిత్ : 2
  • హామర్‌మ్యాన్: 1
  • మేసన్ : 2
  • పైప్‌లైన్ ఫిట్టర్: 2
  • కార్పెంటర్: 6
  • పెయింటర్: 6
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 9

వ్యాగన్ మరమ్మతు ఖాళీలు..

ఫిట్టర్ (110), వెల్డర్ (110), మెషినిస్ట్ (15), టర్నర్ (14), ఎలక్ట్రీషియన్ (14), COPA (4), స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) (1), స్టెనోగ్రాఫర్ (హిందీ) (1)

ఈ అర్హత ఉన్న అభ్యర్థులకు ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ కింద శిక్షణ ఇస్తారు. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 2, 2025వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించాలి. మిగతావారికి ఎలాంటి ఫీజు లేదు. విద్యార్హతలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.